ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిల‌ర్ | Government Land Was Confiscated By A Former TDP Councilor | Sakshi
Sakshi News home page

ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిల‌ర్

Sep 5 2020 10:07 AM | Updated on Sep 5 2020 10:14 AM

Government Land Was Confiscated By A  Former TDP Councilor - Sakshi

సాక్షి, వైఎస్ఆర్ జిల్లా(క‌డ‌ప‌) :  బద్వేలులో టిడిపి మాజీ కౌన్సిలర్‌తో పాటు వారి బంధువులు భూదందాకు పాల్ప‌డ్డారు. వైఎస్సార్  జిల్లా చెన్నంపల్లె రెవెన్యూ పొలంలోని విద్యానగర్‌లో స‌ర్వే నెంబ‌ర్  1774/1,1774/2 లో  సుమారు అయిదు ఎకరాల భూమిని క‌బ్జా చేశారు. కోట్లు విలువ చేసే  ప్రభుత్వ స్థలంలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ మాజీ కౌన్సిల‌ర్‌తో పాటు వారి బంధువుల హ‌స్తం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ప్ర‌భుత్వ భూమిగా ఉన్న స్థ‌లంలో ప్లాట్ల పేరిట అడ్డగోలుగా కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ భూ క‌బ్జాపై స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ల‌గా మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement