36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్‌ ‘కడారి’ | Government Employee Kadari SubbaRao Has Not Taken Single Leave In 36 Years Of Career - Sakshi
Sakshi News home page

36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్‌ ‘కడారి’

Published Sat, Oct 28 2023 8:52 AM | Last Updated on Sat, Oct 28 2023 11:43 AM

Government Employee Kadari SubbaRao No Leaves 36 Year Career - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఉద్యోగమంటే ఏడాదిలో చాలా సెలవులుంటాయి. అతి తక్కువ మంది ఈ సెలవుల వినియోగంలో పొదుపుగా వ్యవహరిస్తారు. అత్యవసరానికి తప్ప మరే పనికీ సెలవు పెట్టారు. కానీ కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే ఆశ్చర్యమే మరి. కాకినాడ జిల్లా  విద్యాశాఖలో కడారి సుబ్బారావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

గొల్లప్రోలుకు చెందిన ఈయన 1987లో గ్రూప్‌–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల కాలంలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఈ నెల 30న రిటైర్‌ కానున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా, 2009లో తెలుగు అకాడమీ పురస్కారం సాధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement