చీమకుర్తి సభలో సరదా సన్నివేశం | Funny Incident At Chimakurthy CM YS Jagan Mohan Reddy Meeting | Sakshi
Sakshi News home page

చీమకుర్తి సభలో సరదా సన్నివేశం

Aug 24 2022 2:02 PM | Updated on Aug 24 2022 5:08 PM

Funny Incident At Chimakurthy CM YS Jagan Mohan Reddy Meeting - Sakshi

సాక్షి, ప్రకాశం:  సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీమకుర్తి విగ్రహావిష్కరణ సభలో సరదా సన్నివేశం జరిగింది. జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగ సమయంలో.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం.. ఆమె మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. పాట పాడడంతో అభిమానుల కోలాహాలం నెలకొంది. 

అయితే సభా సమయం మించి పోతుండడంతో ఆమెను వచ్చి కూర్చోవాలంటూ సైగ చేశారు సీఎం జగన్‌. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో.. స్వయంగా ఆయనే వెళ్లి అమ్మా అని పిలుచుకునే వెంకాయమ్మను వెంటపెట్టి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement