సత్యసాయి జిల్లా: కదిరిలోని కమ్మరవాండ్లపల్లిలో దారుణం జరిగింది. భారీ పేలుడు సంభవించి నలుగురు మృతిచెందగా, ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి.పేలుళ్ల దాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. డిటోనేటర్లు, జిలిటన్ స్టిక్స్‌తో పాటు సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులు వెంకన్న, మాబున్నిస, మధు, సంపత్ గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


