గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు! | Former CM YS Jagan slams Chandrababu Naidus government | Sakshi
Sakshi News home page

గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు!

Aug 27 2026 4:11 AM | Updated on Aug 27 2026 4:11 AM

Former CM YS Jagan slams Chandrababu Naidus government

చంద్రబాబు సర్కార్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

అంతా గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్కర్‌ మయం.. దోపిడీ రాజ్యం

గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియాగా మారింది

మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్‌æ, లేటరైట్, లిక్కర్‌ అన్నీ మాఫియానే 

రైతుకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర ఉంది  

పోలీసులు అధికారపార్టీ నేతలతో కలిసి గంజాయి మాఫియాను నిర్వహిస్తున్నారు 

రేంజ్‌ల వారీగా కలెక్షన్‌లు చేసి చినబాబుకు, పెదబాబుకు వాటాలు ఇస్తున్నారు 

అద్దంకి ఘటనలో ఎస్సైల తీరుపై అధికారుల పరస్పర విరుద్ధ వివరణలు 

ఆ ఎస్సైలు జేమ్స్‌బాండ్‌లైతే వీఆర్‌కు ఎందుకు పంపారు? 

పోలీసు వ్యవస్థ దిగజారిందనేందుకు క్రాంతికుమార్, సాయికృష్ణ ఉదంతాలే నిదర్శనం 

మా హయాంలో సెబ్‌ నియమించి గంజాయిపై ఉక్కుపాదం మోపాం 

గిరిజనులకు 3 లక్షల ఎకరాల పోడుభూములు పంచిపెట్టాం

చంద్రబాబు పాలనలో ఈ రాష్టంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ.. ఒక్క గంజాయికి మాత్రం గిట్టుబాటు ధర వస్తోంది. గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియా స్థాయికి చేరింది. పోలీసులనే వాటాదారులుగా చేసి చినబాబు, పెదబాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు.

నేరస్తులు, పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రేంజ్‌లుగా విభజించి సిండికేట్‌గా ఫామ్‌ అయ్యి.. ఆర్గనైజ్‌్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు.

నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడింది. విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్‌ సొహైల్‌ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడన్నారు. అసలు అతను తప్పించుకున్నాడా? తప్పించబడ్డాడా? జూన్‌ 9న ఘటన జరిగితే ఇప్పటి వరకు సొహైల్‌ను పట్టుకోలేకపోయారు.

పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్‌.. బాధ్యత గల డిపార్టుమెంట్‌.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్‌ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి.  – మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన సర్వం గంజాయి, డ్రగ్స్‌ మయం అని, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా, కల్తీ లిక్కర్‌ అన్నింటా మాఫియానేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఒకవైపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు పెడుతూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్‌ దిగజార్చిన తీరును వీడియోలు ప్రదర్శించి చూపుతూ.. ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ప్రతి వీధికీ బెల్ట్‌ షాపు..
‘‘రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్‌ అన్నీ మాఫియానే. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్‌లు ఎస్‌ఎఫ్‌టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, మెడికల్‌ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్‌ షాపుల పేరిట కల్తీ లిక్కర్‌. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. 

ఎస్సైలు జేమ్స్‌బాండ్‌లు అయితే.. చర్యలెందుకు?
నిజంగానే ఎస్పీ చెబుతున్నట్టుగా సమాచారం మేరకు రెయిడ్‌ చేశారంటే.. డీఎస్పీ చెబుతున్నట్టు ఇద్దరు ఎస్సైలు వెళ్తుంటే.. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమాస్పదంగా కన్పిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలేసి పారిపోయి ఉంటే.. జేమ్స్‌బాండ్‌ 117 మాదిరిగా ఇద్దరు ఎస్సైలు ఛేజ్‌ చేసి ఉంటే.. వాళ్లకు నువ్వేం చేస్తావ్‌? శభాష్‌ అంటూ వాళ్లకు ప్రమోషన్‌ ఇచ్చి గోల్డ్‌ మెడల్, ప్రెసిడెంట్‌ మెడల్, సీఎం మెడల్, ఇంకో మెడల్‌ ఇచ్చేలా చేస్తావ్‌. 

కానీ అంతటి జేమ్స్‌బాండ్‌లకు వీఆర్‌ ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వే ఒకవైపు వాళ్లు జేమ్స్‌బాండ్‌లు అంటున్నావ్‌.. నువ్వే మళ్లీ వాళ్లను వీఆర్‌ అంటున్నావ్‌.. చార్జీషీటు అంటున్నావ్‌.. యాక్షన్‌ అంటున్నావ్‌.. మళ్లీ ఇంకొక పక్కన డీఎస్పీ, ఎస్పీ అందరూ వారిని ప్రొటెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో గంజాయి వదిలి బైక్‌లో పారిపోయాడంటూ ఎవరిని ఇరికిస్తారో పాపం. ఇప్పటికే ఇరికించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా చేస్తున్నారు.

పోలీస్‌ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో!
నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది చెప్పడానికి మరో ఉదాహరణ.. మొన్న విజయవాడలో సీఐ వేధింపులు భరించలేక వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్‌ కుటుంబం చేస్తున్న ఆరోపణ ఏంటి? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇంకో పిల్లాడు సాయికృష్ణ పోలీస్‌ స్టేషన్‌లోనే హత్యకు గురై బూడిద కూడా దొరకని పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్థాయికి దిగజారిపోతుందనేందుకు ఇవన్నీ స్టాండింగ్‌ ఎగ్జాంపుల్స్‌. 

గ్రానైట్‌ మాఫియా నుంచి చినబాబు, పెదబాబుకు కలెక్షన్‌లు
అద్దంకి ఘటనలో వస్తున్న సమాచారం.. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తా ఉంటే.. గ్రానైట్‌ మాఫియా నుంచి పోలీసులే కలెక్షన్‌ చేసి ఎమ్మెల్యేకు ఇంత? చినబాబుకు ఇంత? పెదబాబుకు ఇంత? పంచే క్రమంలో ప్రైవేట్‌ పార్టీ చేసుకుంటూ మత్తులోకి వెళ్లిపోయారు. ఆ మత్తులోనే ఎస్సైలు  కారులో వెళ్తూ దారిలో ఇదంతా జరిగింది. నిజంగా పోలీసుల సౌలభ్యం కోసం ఐజీలకు రాయలసీమ, కోస్తా అనే రేంజ్‌లు ఇస్తారు. ఫస్ట్‌టైమ్‌ ఏం చూస్తున్నామో తెలుసా? రేంజ్‌లుగా విభజించి సిండికేట్‌గా ఫామ్‌ అయ్యి.. కలెక్షన్‌ల వసూళ్లలో పాత్రధారులుగా పోలీసులే ఉండటం. ఎమ్మెల్యేల మద్దతుతో వసూళ్లు చేసి చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత? అని ఆర్గనైజ్‌్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు. 

కుప్పంలోనూ విచ్చలవిడిగా గంజాయి..
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా  విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వాళ్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికారపార్టీకి చెందిన నేత అనుచరులు తమిళనాడులో 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇవన్నీ నిజాలు. కుప్పం టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. చంద్రబాబు పాలనలో సర్వం గంజాయి మయం.. సర్వం దోపిడీ మయం.. సర్వం డ్రగ్స్‌ మయం.. సర్వం నకిలీ లిక్కర్‌ మయం..

క్రమశిక్షణా చర్యలంటూ కప్పిపుచ్చడమెందుకు?
» మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్‌ చేసేందుకు ఏంచేశారో గమనించాలి. (వీడియోలు ప్రదర్శించి వివరించారు.) డీఎస్పీ చెబుతున్న మాటలకు.. ఎస్పీ చెబుతున్న మాటలకు.. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ రిపోర్టుకు పొంతనలేదు. డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్‌ఐఆర్‌లలో మూడు వేర్వేరు వెర్షన్లు చెప్పారు.

» ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే.. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కన్పిస్తే.. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్‌పై పారిపోతుండగా.. వీరిద్దరు కారులో ఛేజ్‌ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ చెప్పాడు.

» కాదు కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున.. ఆ సమాచారం మేరకు రెయిడ్‌ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. 

» ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఇద్దరు ఎస్సైల వాంగ్మూలం చూడండి.  ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్సై పిలిస్తే.. సంతమాగులూరు ఎస్సై వెళ్లాడంట. కాంట్రడిక్షన్‌ చూడండి. మూడు వెర్షన్స్‌ ప్లే చేస్తాను చూడండి. (డీఎస్పీ, ఎస్పీ వీడియోలు ప్లే చేసి చూపించారు).  

»  గంజాయిని సీజ్‌ చేశారని, వేగంగా వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టారని, ప్రమాదం జరగడంతో 108కు ఎస్సై ఫోన్‌ చేశాడని, గాయపడిన వారిని ఎస్సై అంబులెన్స్‌లో ఎక్కించి పంపించాడని ఎస్పీ చెప్పాడు. కానీ 108 రికార్డులో సమాచారం ఇచ్చింది స్థానికుడు అని రిపోర్టు అయ్యి ఉంది. చంద్రబాబు వచ్చాక 108 కాంట్రాక్ట్‌ తమ వాళ్లకే కట్టబెట్టారు. ఆ నిర్వాహకులే.. స్థానికుడు సమాచారం ఇచ్చినట్టు 108 పేషెంట్‌ కేర్‌ రికార్డులో పేర్కొన్నారు. 

»  ఎస్సైలు ఆ రోజు మత్తులో కారులో వెళ్తూ ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కారు నడుపుతున్న ఎస్సై, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్నారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న ఆ కారులో గంజాయి ఉంది. లిక్కర్‌ బాటిల్‌ ఉంది. పోలీస్‌ యూనిఫాం ఉంది. 

» ఇన్ని కన్పిస్తుంటే.. వాళ్లను డీఎస్పీ రక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు.. తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. వీడియోలు తీసినప్పుడు సీఐ బెదిరిస్తాడు.. వీడియోలు తీయొద్దని. వీడియోలు, ఫొటోలు తీస్తే అరెస్టు చేస్తానని బెదిరిస్తాడు. ఐపీఎస్‌ చేసిన ఎస్పీ కూడా గంజాయి తరలిస్తున్న ఎస్సైలను ప్రొటెక్ట్‌ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నాడు. 

» పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్‌.. బాధ్యత గల డిపార్టుమెంట్‌.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్‌ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. కానీ చంద్రబాబూ నువ్వేం చేస్తున్నావ్‌ ఆ ఎస్సైలను కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలు,  తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలు అన్నీ బిల్డ్‌ చేస్తా ఉన్నావ్‌. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.. గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తున్నారు.. అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడం కాదా? ఇలా జరుగుతోంది రాష్ట్రంలో పరిపాలన.

పోలీసులే వాటాదారులుగా గంజాయి మాఫియా..!
మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఓ ఊదాహరణ.  ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ వ్యవస్థతోనే.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు  వ్యవస్థతోనే..  దగ్గరుండి వారిని కూడా వాటాదారులుగా చేస్తూ.. డ్రగ్స్, గంజాయి మాఫియాను ఆ స్థాయికి తీసుకుపోతే ప్రజలు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి? అద్దంకి ఘటనలో తాజా సమాచారం ప్రకారం మత్తులో ఉన్న ఒక ఎస్సై కారు నడిపితే మరో ఇద్దరు ఎస్సైలు మత్తులో వెనుక సీట్లో కూర్చున్నారు. 

ఆ కారుతో ఒక ఆటోని ఢీకొట్టడం.. యాక్సిడెంట్‌  అయిన తర్వా­త ఆ కారును ప్రజలు చుట్టు­ముట్టడం.. అందులోనివారంతా మత్తులో ఉండడాన్ని ప్రజలు చూడటం.. వెనక సీటులో, డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్‌ యూని­ఫామ్‌ దొరకడం.. ఇదంతా చూసి ప్రజలు షాక్‌కు గురయ్యారు. మనం నిజంగా ఏపీలో ఉన్నామా? లేక కొలంబియాలో ఉన్నామా? అని అన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసి ప్రతీ ఒక్కరు కూడా ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటే సీఐ వచ్చి బెదిరించాడు. వీడియో తీస్తే జైలులో పెడతా అన్నాడు. (ఈ ఘటనను వీడియో, ఫొటోలతో వైఎస్‌ జగన్‌ వివరించారు).

మా హయాంలో.. ఉక్కుపాదం మోపాం..
ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో­(సెబ్‌) పెట్టి గంజాయి, డ్రగ్స్‌పై మా హయా­ంలో ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. 4.50కోట్ల గంజాయి మొక్కలు తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా రూట్లన్నీ బ్లాక్‌ చేశాం. 

ఏజెంట్ల మాయలో పడి.. వారు చెప్పినట్టుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ట్రైబల్స్‌ను గుర్తించి ఆపరేషన్‌ పరివర్తన్, ఆపరేషన్‌ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నా­య పంటల సాగు  ప్రోత్సహించాం. దాదాపు 3లక్షల ఎకరాలకుపైగా పోడు భూములు గిరిజనుల­కు పంచిపె­ట్టాం. ఈ రోజు టోటల్‌ రివర్స్‌. పోలీసుల చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ టీడీపీ నాయకులు అందరూ కలిసి చేస్తున్న  మాఫియా సామ్రాజ్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement