శక్తి సదన్‌ నుంచి ఐదుగురు యువతుల పరారీ | Five young women abscond from Shakti Sadan | Sakshi
Sakshi News home page

శక్తి సదన్‌ నుంచి ఐదుగురు యువతుల పరారీ

Oct 7 2026 4:42 AM | Updated on Oct 7 2026 4:42 AM

Five young women abscond from Shakti Sadan

విశాఖలో ఘటన

ఆరిలోవ: శక్తి సదన్‌ నుంచి ఐదుగురు యువతులు పారిపోయిన ఘటన విశాఖపట్నంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. శక్తి సదన్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.నాగేశ్వరి తెలిపిన వివరాలు.. అనాథలు, వివిధ ఘటనల్లో పోలీసులు విముక్తి కల్పించిన మహిళల కోసం పైనాపిల్‌ కాలనీలో ప్రభుత్వం శక్తి సదన్‌ నిర్వహిస్తోంది. ఇందులో 26 మంది యువతులు ఉంటున్నారు. వీరిలో ఆరుగురు అనాథలు కాగా.. నగరంలోని స్పాలపై దాడులు చేసి పోలీసులు తీసుకువచ్చిన వారు 20 మంది ఉన్నారు. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకరు సోమవారం అర్ధరాత్రి బాత్రూమ్‌లోని వెంటిలేటర్‌ను విరగ్గొట్టి బయటకు దూకి పారిపోయారు. 

మంగళవారం ఉదయం వాచ్‌మెన్‌ గుర్తించి సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు చేయడంతో ద్వారకా ఏసీపీ మల్లేశ్వరరావు, ఆరిలోవ ఎస్‌ఐ రాజేశ్వరి శక్తి సదన్‌కు చేరుకొని.. పరిశీలించారు. కాగా, ఇక్కడి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి సమయంలో ఒక్క వాచ్‌మెన్‌ మాత్రమే భద్రతా విధుల్లో ఉంటున్నారు. అలాగే భవనానికి వెనుక వైపు సీసీ కెమెరాలు లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న యువతులు వెనుక నుంచి పారిపోయారు. విదేశీ, దేశీయ యువతులు ఉంటున్న ఈ గృహానికి ప్రత్యేక పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement