
అనకాపల్లి: హోంమంత్రి అనితకు నిరసన సెగ గట్టిగా తగిలింది పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్య పేటలో హోంమంత్రి అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్నారు మత్య్సకారులు. బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే బల్క్ డ్రగ్ పార్క్ సమస్యపై కమిటీ వేస్తామని హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనిత. అయితే కమిటీకి మత్స్యకారులు అంగీకరించలేదు. హోంమంత్రి కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. పోలీసుల సాయంతో భయపెట్టే ప్రయత్నం చేసినా మత్స్యకారులు.వెనక్కి తగ్గలేదు. మత్స్యకారులు భారీ సంఖ్యలో చేరుకుని తమ నిరసనను తెలియజేశారు. తమ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.

ఇదీ చదవండి:
కూటమి సర్కార్‌పై స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతం