
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది మలి దశకు విశాఖ ఉక్కు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులతో కలిసి సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పోరాట కమిటీ ఉంది.
మరోవైపు, కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్ సేవలో తరిస్తోందని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత శనివారం జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై చూపిస్తున్న తపన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చూపకపోవడం ప్రజలను వంచించడమేనన్నారు.
