‘దుమ్ము’ లేపారు! | Farmers protest to the Ritwik company camp office | Sakshi
Sakshi News home page

‘దుమ్ము’ లేపారు!

Jul 14 2026 3:37 AM | Updated on Jul 14 2026 3:37 AM

Farmers protest to the Ritwik company camp office

రిత్విక్‌ కంపెనీ క్యాంప్‌ దగ్గర ధర్నా చేస్తున్న రేకలకుంట పంచాయతీ ప్రజలు

రిత్విక్‌ కంపెనీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు, ప్రజలు 

ఆ కంపెనీ భారీ వాహనాల వల్ల వచ్చే దుమ్ముతో పంట దెబ్బతింటోందని రైతుల ఆందోళన  

బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని మైదుకూరు–బద్వేల్‌ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ‘రిత్విక్‌ కంపెనీ’ క్యాంప్‌ కార్యాలయాన్ని సోమవారం స్థానిక ప్రజలు, రైతులు ముట్టడించారు. ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన ఈ కంపెనీ.. రోడ్డు, పైపులైన్‌ల నిర్మాణం కోసం డి.అగ్రహారం వద్ద భారీ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదిగా ఈ క్యాంప్‌ నుంచి రేకలకుంట, బాలాజీనగర్, బాగాదిపల్లె, గొల్ల పల్లె గ్రామాల మీదుగా టిప్పర్లు, భారీ లారీలు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము విపరీతంగా వస్తోందని రైతులు ధ్వజమెత్తారు.

ఈ దు మ్ము వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజులుగా రుతి్వక్‌ కంపెనీ క్యాంప్‌ కార్యాలయం వద్ద నిరసనలు, ధర్నా చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ముట్టడించామని చెప్పారు. రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో సోమవారం డి.అగ్రహారానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కానాల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు, కంపెనీ ప్రతినిధులతో  చర్చలు జరిపారు. బ్రహ్మంసాగర్‌ సమీపంలో 2 కిలోమీటర్ల అప్రోచ్‌ రోడ్డు నిరి్మంచడంతోపాటు తాగునీటి అవసరాల కోసం వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా మని కంపెనీ ప్రతినిధులు రాతపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన తాత్కాలికంగా విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement