
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం తయారీలో ఏ–1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్నార్ బార్‌లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు. బార్ లోపల మద్యం బాటిళ్లు, మద్యం కొనుగోలు ఇన్‌వాయిస్ రికార్డులు, అమ్మకాల రికార్డులు, లోపల ఉన్న మద్యం సీసాల వివరాలు, బార్‌లో ఉన్న మద్యం అసలైనదా లేదా నకిలీదా అని పరిశీలించారు.
ఈ నెల 3న అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో అద్దేపల్లి జనార్దనరావును ప్రధాన నిందితుడిగా తేల్చి ఆయనకు చెందిన ఏఎన్నార్ బార్‌ను ఈ నెల 5న సీజ్ చేశారు. గురువారం ఆ సీల్‌ను తొలిగించి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో లభించిన వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.