సాక్షి,విజయవాడ: మాజీమంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయనపై మరో కేసు మోపేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈనెల 11వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, అంబటి రాంబాబు మాత్రం ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాము ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించామని, ఈ వ్యవహారంలో అంబటి రాంబాబు నేరుగా తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఈడీ విచారణకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


