అన్నమయ్య జిల్లా: రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లెలో శనివారం సాయంత్రం భూమి కంపించి.. పెద్దగా శబ్ధం రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6:54 నిముషాలకు భూమి రెండు సార్లు కంపించినట్టు తెలిపారు. ఇళ్లలోని సామాన్లు, పొయ్యిపై పాత్రలు, పడుకున్న మంచాలు సైతం కిందపడిపోయినట్టు తెలిపారు.


