కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి

Earth Sagged Due To Lightning Strike In Konaseema District - Sakshi

సాక్షి, మామిడికుదురు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపా­టుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వాతావర­ణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

చిమ్మ చీకట్లో అకస్మాత్తుగా సుబ్రహ్మ­ణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపో­యిందని ఆ గ్రామ సర్పంచ్‌ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు.
చదవండి: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top