అర్నాబ్‌ ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ | Andhra Pradesh: Cyclone Arnab October 29 2026 Updates | Sakshi
Sakshi News home page

అర్నాబ్‌ ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్

Oct 29 2026 6:59 AM | Updated on Oct 29 2026 7:57 AM

Andhra Pradesh: Cyclone Arnab October 29 2026 Updates

అర్నబ్‌ అతి తీవ్ర తుపాను కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. పెను గాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారు. నిన్న రాత్రి వరకూ గాలివాన కొనసాగింది. అన్నదాతలకు అర్నబ్. అపార నష్టాన్ని మిగిల్చింది. కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగింది. ఇవాళ కూడా(గురువారం) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక

  • ఏపీలో నవంబర్‌ 5 వరకు విస్తారంగా వర్షాలు
  • ఏపీలో మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు
  • గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్‌
  • ప్లాష్‌ ఫ్లడ్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక
  • బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..?
  • ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం
     

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

  • తుపాను తీరం దాటినా తొలగని ముప్పు..

  • గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు: ఐఎండీ

  • కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్

  • విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు  

    రాజమండ్రిలో అర్నాబ్ విధ్వంసం​

  • ఏకధాటిగా ఈదురు గాలులతో కురిసిన వర్షం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మరి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
  • కోనసీమలో మూడో రోజు కూడా సరఫరా కాని విద్యుత్
  • తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో భారీగా పంట నష్టం
  • లక్ష 18 ఎకరాల్లో వరి డ్యామేజ్ జరిగినట్టు ప్రాథమిక అంచనా

కాకినాడ జిల్లా:

  • జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో 29 గ్రామాల్లో తుపాన్‌ ప్రభావానికి గురైన 21,522 మంది
  • భారీ వర్షాలు, ఈదురు గాలులకు 78 ఇళ్లు ధ్వంసం
  • వేటకు వెళ్లి సముద్రంలో ముగ్గురు మత్స్యకారుల గల్లంతు
  • 68 బోట్లు, అందులో వలలను కోల్పోయిన మత్స్యకారులు
  • ఈదురు గాలులకు విద్యుత్ వ్యవస్ధ చిన్నాభిన్నం
  • 3 సబ్ స్టేషన్‌లో 14 ఫీడర్లు దెబ్బతినడం.. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో 32 గంటల పాటు అంధకారంలో పలు గ్రామాలు
  • మూడో రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ హరేంధర్ ప్రసాద్

నరసాపురం వద్ద 6 గంటల పాటు ల్యాండ్‌ఫాల్‌

  • 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు  
  • గోపాలపట్నంలో ఏకంగా 31.6 సెంటీమీటర్ల వర్షం
  • విజయనగరం జిల్లా కొత్తవలసలో 30.6 సెంటీమీటర్ల వర్షం
  • 108 చోట్ల 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం  
  • నేలకొరిగిన వేలాది వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు
  • ఉప్పాడలో విధ్వంసం.. తీరంలో రోడ్డుపైకి కొట్టుకొచ్చిన బండరాళ్లు  
  • లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన వరి, అరటి, ఇతర పంటలు
  • రైతుల ఆశలు అడియాశలు చేసిన తుపాను
  • శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 10 పునరావాస శిబిరాల్లో భోజనం నిల్‌
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement