సాక్షి, విశాఖపట్నం: తుపాను తీరం దాటినా ముప్పు ఇంకా తొలగలేదు. ఇవాళ కూడా(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై మరోసారి కుండపోత కురిస్తే వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది.
విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: ‘అర్నబ్’ విలయం..కోస్తా కకావికలం


