మదనపల్లెలోనూ విధ్వంసం! | TDP new conspiracy in elections | Sakshi
Sakshi News home page

మదనపల్లెలోనూ విధ్వంసం!

Oct 29 2026 6:22 AM | Updated on Oct 29 2026 6:22 AM

TDP new conspiracy in elections

ఒంటిమిట్ట మండలంలో వైఎస్సార్‌సీపీ నేతను బెదిరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి (ఫైల్‌)

గొడవలు సృష్టించి చేజిక్కించుకునేలా మంత్రి మండిపల్లి స్కెచ్‌ 

బూత్‌లు క్యాప్చర్‌ చేసేలా తన రౌడీగణానికి బాధ్యతలు 

ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి రిగ్గింగ్‌ చేసుకునేలా ఎత్తులు  

మొన్న రాయచోటిలో రణరంగం సృష్టించి నామినేషన్లు అడ్డగింత 

ఇటీవల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ ఇదే కుట్ర 

రౌడీయిజానికి కేరాఫ్‌గా మారుతున్న రాంప్రసాద్‌రెడ్డి 

బాబూ కొడుకుల ఆశీస్సుల కోసం పేట్రేగిపోతున్న వైనం 

పోలింగ్‌ రోజున ఎస్‌ఈసీ ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేయించాలంటున్న ప్రజలు

సాక్షి, అమరావతి : తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల ఆశీస్సుల కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బరితెగించి వ్యవహరిస్తుండటం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రౌడీయిజంతో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలపై వరుస దాడులతో చెలరేగిపోతున్న ఆయన వ్యవహారం అటు టీడీపీలోనూ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో నవంబర్‌ 1వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ దఫా మదనపల్లెపై ఆయన కన్ను పడినట్లు సమాచారం. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో ఆ పార్టీ నేరుగా గెలిచిన చరిత్ర లేదు. ఈ నేపథ్యంలో దౌర్జన్యం, అరాచకం, అల్లర్లు సృష్టించి ఎలాగైనా సరే అడ్డదారిలో మదనపల్లెలో విజయం సాధించడానికి పక్కా కుతంత్రం రూపొందించినట్లు తెలుస్తోంది. 48 వార్డులున్న మదనపల్లె మున్సిపాలిటీలో 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ పోటీలో నిలిచింది. 

బలమైన బీసీ అభ్యర్థి జింకా చలపతిని చైర్‌పర్సన్‌ అభ్యరి్థగా రంగంలో నిలిపింది. వైఎస్సార్‌సీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న మదనపల్లె పట్టణంలో మామూలుగా అయితే టీడీపీ విజయం సాధించడం అసాధ్యమని స్థానికులు, విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. అందువల్ల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అల్లర్లు సృష్టించి.. ఓటింగ్‌ శాతం పెరగకుండా చేసి.. ఆపై పోలింగ్‌ బూత్‌లను క్యాప్చర్‌ చేసి.. రిగ్గింగ్‌ చేసేలా సదరు మంత్రి పక్కా స్కెచ్‌ వేసినట్లు విశ్వసనీయ సమాచారం.

 ఇందులో భాగంగా ఒక్కో వార్డులో కొంత మంది రౌడీలు తిష్ట వేసి, గొడవలు సృష్టించే ఎత్తుగడ రూపొందించినట్లు తెలిసింది. రాయచోటి, ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీ మూకలు, కిరాయి మూకలకు ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. బలమైన మదనపల్లెలో గెలిపించి చంద్రబాబు, లోకేశ్‌లకు కానుకగా ఇస్తానని సదరు అమాత్యుడు తన సన్నిహితుల వద్ద చాలెంజ్‌ చేసినట్లు టీడీపీ నాయకుడొకరు తెలిపారు. ఈ క్రమంలో ఆరోజు మదనపల్లెలో ఎందాకైనా బరితెగించి వెళ్లడానికి టీడీపీ మూకలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

ఆది నుంచీ ఇంతే..
మంత్రి మండిపల్లి తీరు మొదటి నుంచీ వివాదాస్పదమేనని అందరికీ తెలిసిందే. ఇటీవల రాయచోటిలో సైతం మున్సిపాలిటీకి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా తన రౌడీ మూకల ద్వారా అడ్డగించారు. ఏకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడికి వుసిగొల్పారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో రౌడీ మూకలు పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి తలుపులపై పెట్రోల్‌ పోసి అంటించడం తెలిసిందే. 

అంతటితో ఆగకుండా బయట నిలిపి ఉన్న ఏడు వాహనాలపై పెట్రోల్‌ పోసి అంటించడం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాషీ్టకాన్ని కళ్లకు కట్టింది. గతంలో అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సైతం మంత్రి మండిపల్లి స్వయంగా దౌర్జన్యానికి పాల్పడటం విస్తుగొలిపింది. గత ఏడాది ఆగస్టు 12న ఒంటిమిట్ట జెడ్పీ హైసూ్కల్‌లోని బూత్‌లోకి ప్రవేశించిన మంత్రి గట్టిగా కేకలు వేస్తూ.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను బయటికి పంపించేశారు. 

మంత్రి అనుచరులు, టీడీపీ ఏజెంట్లను మాత్రమే కూర్చోబెట్టారు. ఆ తర్వాత చిన్నకొత్తపల్లె గ్రామంలోకి 300 మందితో వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయించారు. మండలంలోని 30 కేంద్రాల్లో మంత్రి సమక్షంలో ఆయ అనుచరులు దగ్గరుండి దొంగ ఓట్లు వేసుకున్నారు. 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటం వల్లే మండిపల్లి ఇలా పేట్రేగిపోతున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఇంతగా రెచి్చపోతున్న సదరు మంత్రిని పోలింగ్‌ రోజున గృహ నిర్బంధం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి గొడవలకు పాల్పడని వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధాలు చేయడం మానేసి.. గతంలో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని మంత్రి మండిపల్లిని ముందస్తుగా పోలీసుల అదుపులో ఉంచి హౌస్‌ అరెస్ట్‌ చేసేలా ఎస్‌ఈసీ.. తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement