వైఎస్సార్‌ సీపీలోకి వరుస కట్టి.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి వరుస కట్టి..

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి

గోపాలపురంలో మాజీ ఎంపీటీసీ దొరబాబుకు పార్టీ

కండువా వేసి ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి తానేటి వనిత

రంగంపేట: వడిశలేరు గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. సోమవారం అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన పైడిశెట్టి లోవరాజు, పైడిశెట్టి పెద్దరాజు, అండ్రు నాగార్జున, బత్తిన పెద్ద యేసు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయేలు, మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, నిమ్మలపూడి శ్రీధర్‌, పార్టీ కన్వీనర్‌ నలమాటి భీముడు తదితరులు పాల్గొన్నారు.

భారీగా చేరికలు

దేవరపల్లి: గోపాలపురం నియోజకవర్గంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ద్వారకాతిరుమల, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ కండువాలను వేసుకున్నారు. మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత వీరికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గోపాలపురంలో ఆదివారం రాత్రి వనిత సమక్షంలో మాజీ ఎంపీటీసీ, టీడీపీ నాయకుడు పైడి దొరబాబు వైఎస్సార్‌ సీపీలో చేరారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో టీడీపీ నాయకుడు బిరుదుగడ్డ రాంబాబు విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), మండల పార్టీ అధ్యక్షుడు కూచిపూడి సతీష్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గన్నమని జనార్ధనరావు సమక్షంలో వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాంబాబుకు గన్నమని వెంకటేశ్వరరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

టీడీపీ నుంచి భారీగా చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement