గోదావరి పుష్కరాల్లో వలంటీర్ల సేవలు కీలకం | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాల్లో వలంటీర్ల సేవలు కీలకం

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

రాజానగరం: వచ్చే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, విద్యార్థుల సేవలు కీలకమని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఏవిధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ అన్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, గోదావరి జిల్లాల ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సేవలందించాలన్నారు. ఇందుకోసం సేవాభావం కలిగిన వలంటీర్లను, విద్యార్థులను ఇప్పటినుంచే ఎంపిక చేసి, అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు విద్యార్థులకు సెలవులు ఉంటాయి కనుక రాజమహేంద్రవరంలోని ఘాట్లతో పాటు ధవళేశ్వరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, సీతానగరం తదితర ప్రాంతాలలోని ఘాట్ల వద్ద విద్యార్థులు స్వచ్ఛందంగా సేవలందించవచ్చన్నారు. అనంతరం వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీతో కలిసి ‘ఇన్నోవేషన్స్‌ – గోదావరి పుష్కరాలు’ బ్రోచర్‌ని కలెక్టర్‌ విడుదల చేశారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ శుభం నొఖ్వాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆదిత్యశర్మ, డిప్యూటీ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, తహసీల్దార్‌ దివ్యభారతి, రిజిస్టార్‌ ఆచార్య కేవీ స్వామి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement