ప్రణతులివే.. పరమశివా | - | Sakshi
Sakshi News home page

ప్రణతులివే.. పరమశివా

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

కార్తిక మాసం.. ఆపై తొలి సోమవారం కావడంతో జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రణతులివే పరమశివా అంటూ ఆ స్వామివారిని భక్తజనం కొలిచింది. రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో వేకువజామునే పుణ్యస్నానాలు చేశారు. గోదావరి గట్టున ఉమామార్కండేయ స్వామి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం, శృంగేరీ శారద శంకర మఠంలో చంద్రమౌళీశ్వరునికి పంచామృత అభిషేకాలు జరిగాయి. టి.నగర్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయం, జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించారు.

–సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement