కరోనాతో ఒకరి మృతి? | DMHO announces no deaths from COVID | Sakshi
Sakshi News home page

కరోనాతో ఒకరి మృతి?

May 30 2025 2:34 AM | Updated on May 30 2025 2:34 AM

DMHO announces no deaths from COVID

కోవిడ్‌తో ఎవరూ మృతిచెందలేదని డీఎంహెచ్‌వో ప్రకటన 

మహారాణిపేట(విశాఖ)/ముసునూరు: కరోనా సోకి విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (60) గురువారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది. ఆ రోగి కోవిడ్‌తో మృతిచెందినట్టు అతని కేస్‌ షీట్‌లో నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వ్యక్తి కోవిడ్‌తో మృతిచెందలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఇంతవరకు ఏ విధమైన కోవిడ్‌ మరణం నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఏలూరు జిల్లాలో కోవిడ్‌ కేసు నమోదు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన ఓ వ్యక్తి (52)కి కరోనా సోకింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో ఓ ఫంక్షన్‌కు హాజరైన ఆయన ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి వచ్చి అనారోగ్యానికి గురవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. వైద్యులు కోవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా, పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతన్ని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచినట్టు ముసునూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ షకీనా ఇవాంజిలిన్‌ గురువారం తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement