59.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ | Distribution of pensions to above 59 lakh people Andhra Pradesh | Sakshi
Sakshi News home page

59.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

Oct 4 2021 5:18 AM | Updated on Oct 4 2021 5:18 AM

Distribution of pensions to above 59 lakh people Andhra Pradesh - Sakshi

విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సాగరం పంచాయతీ శివారు ఓకే శ్రీరాంపురం గ్రామానికి చెందిన వుట జగ్గయ్యమ్మకు పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ రమేష్‌

సాక్షి, అమరావతి: సెలవు రోజు అయినా ఆదివారం కూడా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60.81 లక్షల మందికి పింఛను డబ్బులు విడుదల చేయగా.. తొలి 3 రోజుల్లో 59,31,526 మంది (97.53 శాతం) లబ్ధిదారులకు రూ.1,385.16 కోట్లను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా సోమ, మంగళవారాల్లో వారి ఇళ్ల వద్దే వలంటీర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement