
ఇప్పుడు ఎందుకు బిగిస్తున్నారు?
సీఎం చంద్రబాబును ప్రశ్నించిన
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్, వర్కర్స్ యూనియన్, గ్రామ/వార్డు సచివాలయం ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అండ్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు.
అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు నాలుగు వేల మంది కారి్మకులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ కారి్మకుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరిస్తానని చెప్పారు.
తెలంగాణ మాదిరిగానే నేరుగా జీతాలు అందజేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్స్, లైన్ మేన్‌లకు, ఇతర కారి్మకులకు ఉద్యోగభద్రత కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టండని ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశి్నంచారు.