పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్‌

Counseling once again for PG Medical proprietary quota seats - Sakshi

24 గంటల్లో వెబ్‌ ఆప్షన్లు నమోదుకు ఆదేశం

సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్‌ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది.

అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్‌ఎల్, మహా­రాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించింది.

ఆ తర్వాత రాజమండ్రి జీఎస్‌ఎల్‌ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్‌ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్‌ ఫేజ్‌–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top