
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకు 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 21,75,070కి చేరింది.
కొత్తగా 9,747 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 1,76,333కి చేరాయి. తాజాగా 67 మంది మృతితో మొత్తం మరణాలు 1,604కి చేరాయి. ఆస్పత్రుల నుంచి 6,953 మంది డిశ్చార్జ్ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95,625కి చేరింది. యాక్టివ్ కేసులు 79,104 ఉన్నాయి. మిలియన్ జనాభాకు 40,732 పరీక్షలు నిర్వహిస్తున్నారు.