‘ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిని బయటపెడతా’ | Contractor Purushottam Naidu Warns MLA Pulivarthi Nani | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిని బయటపెడతా’

Jun 26 2026 9:15 PM | Updated on Jun 26 2026 9:26 PM

Contractor Purushottam Naidu Warns MLA Pulivarthi Nani

తిరుపతి:  చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అవినీతిని బయటపెడతానని  కాంట్రాక్టర్‌ పురుషోత్తం నాయుడు హెచ్చరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, రోడ్డు నిర్మాణానికి తన వద్ద లంచం తీసుకున్నారని ఆరోపించారు. రూ. 29 లక్షల ముడుపులను తానే స్వయంగా పంపానని పురుఫోత్తం నాయుడు స్పష్టం చేశారు. 

‘సేవ్ చంద్రగిరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. చంద్రగిరి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. లక్షల్లో లంచంను నా దగ్గర నుంచి వసూలు చేశారు. నా దగ్గర ఆధారాలున్నాయి. మట్టి తరలింపునకు నాకు అవకాశం ఇచ్చి, వేరొకరు మట్టి తరలిస్తున్నారు. మట్టి తరలింపు వల్ల నాకు వచ్చిన నష్టం లేదు. కానీ నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు?,  చంద్రగిరిలో అభివృద్ధి ఆగిపోయి, అవినీతి పెరిగిపోతోంది. సేవ్ చంద్రగిరి పేరుతో మేము చేపట్టే కార్యక్రమానికి ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాం’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement