ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం? | Committee Ask Officials On overnment Office Buildings At Vizag | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆరా తీసిన అధికారుల కమిటీ

Oct 17 2023 10:53 AM | Updated on Oct 17 2023 12:37 PM

Committee Ask Officials On overnment Office Buildings At Vizag - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్‌లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement