నేడే జరగాలి.. జరగాల్సిందే! | Collectors want polling to be postponed in cyclone-hit areas | Sakshi
Sakshi News home page

నేడే జరగాలి.. జరగాల్సిందే!

Nov 5 2026 2:55 AM | Updated on Nov 5 2026 2:55 AM

Collectors want polling to be postponed in cyclone-hit areas

కాకినాడ జిల్లా కరప మండల పరిషత్‌ కార్యాలయంలో బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపరచిన గదిలోకి చేరిన వర్షం నీరు

తుపాను ప్రాంతాల్లో పోలింగ్‌ వాయిదా వేయాలన్న కలెక్టర్లు 

ఈ మేరకు కారణాలు వివరిస్తూ ఎస్‌ఈసీకి లేఖలు 

విషయం సీఎం చంద్రబాబుకు తెలిసి వెంటనే జోక్యం 

కలెక్టర్లతో మాటామంతి.. వెనువెంటనే మరో నివేదిక 

పోలింగ్‌ నిర్వహణకు అంతా బావుందని తాజాగా లేఖ 

తుపాన్‌ను అడ్డుపెట్టుకుని లబ్ధి పొందేలా స్కెచ్‌ 

సాక్షి, అమరావతి : ‘మురసు’ తుపాను విరుచుకు పడటంతో రాష్ట్రంలోని సగం గ్రామాలు, పట్టణాలు జలమయమై జన జీవన స్రవంతికి ఇబ్బందులెదురైన పరిస్థితి కళ్లకు కడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వీలైనన్ని ఓట్లు గుద్దిపోసుకోవడానికి ఇదే సరైన తరుణమని భావించడం విస్తుగొలుపుతోంది. పలు జిల్లాల కలెక్టర్లు తుపాను వేళ పోలింగ్‌ వాయిదా వేయాలని కోరినా ససేమిరా అంటూ.. అనుకున్నది అనుకున్నట్లు జరగాలని పట్టుబట్టి నివేదికలను మార్పించడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో.. డజన్‌ కుట్రలతో అడ్డగోలుగా విజయం సాధించేలా కుతంత్రాలు పన్నిన విషయం విదితమే. 

ఈ క్రమంలో మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా ఆదిలోనే అడ్డుకోవడం.. టీడీపీ గూండాలు పత్రాలు లాక్కొని చింపేయడం.. ఈ అడ్డంకులు దాటుకుని ఎవరైనా నామినేషన్‌ దాఖలు చేసి ఉంటే.. ఏకంగా ఆర్వోల వద్దకే వెళ్లి వారి వద్ద ఉన్న పత్రాలు ఎత్తుకెళ్లడం.. ఆపై ఎవరైనా పోటీలో నిలిచి ఉంటే బెదిరింపులకు గురిచేయడం కళ్లకు కట్టినట్లు చూశాం. ఇందుకు సంబంధించి వందలాది వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అన్ని అడ్డంకులను అధిగమించి పోలింగ్‌ దాకా వచ్చిన చోట్ల ఏకంగా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లనే గెంటి వేయడమూ చూశాం.  

ఇప్పుడూ అదే పంథా 
జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే దౌర్జన్యం కొనసాగింది. నేడు (గురువారం) పోలింగ్‌ జరగనుంది. అయితే మురసు తుపాను కారణంగా వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్‌ అలెర్ట్‌లను జారీ చేసింది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి.. గురువారం పోలింగ్‌ నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ వెంటనే మరో నివేదిక తెప్పించారు. దీంతో పోలింగ్‌ను ఎస్‌ఈసీ వాయిదా వేయలేక పోయింది. 

వాస్తవానికి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని స్వయంగా సీఎం చంద్రబాబు సైతం తన ఏరియల్‌ సర్వేలో గుర్తించారు. అయినప్పటికీ తుపాను వేళ అయితే రిగ్గింగ్, సైక్లింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉంటుందని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజలను మభ్యపెట్టడానికన్నట్లు తూతూ మంత్రంగా కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే వాయిదా వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత కుంచిత బుద్ధితో వ్యవహరించడం దేశంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని అధికార వర్గాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement