ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Visits Delhi On 15th December | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌

Dec 15 2020 2:37 PM | Updated on Dec 15 2020 8:43 PM

CM YS Jagan Visits Delhi On 15th December - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దేశ రాజధానిలో అడుగుపెట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరదలు, తుఫాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేలా సహకరించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితోపాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకెళ్తారని ఆంధ్రప్రదేశ్‌ అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి‌ వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement