ఈ నెల 11,12 తేదీల్లో సీఎం జగన్‌ తిరుమల పర్యటన | CM YS Jagan Visit To Tirumala On October 11th And 12th | Sakshi
Sakshi News home page

ఈ నెల 11,12 తేదీల్లో సీఎం జగన్‌ తిరుమల పర్యటన

Oct 8 2021 5:50 PM | Updated on Oct 8 2021 8:12 PM

CM YS Jagan Visit To Tirumala On October 11th And 12th - Sakshi

ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

సాక్షి, అమరావతి: ఈ నెల 11,12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సిఎం తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల విభాగాన్ని సీఎం ప్రారంభించనున్నారు. (చదవండి: దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా)

అలిపిరి వద్ద గో మండపాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 12న ఉదయం శ్రీవారిని సీఎం వైఎస్‌ జగన్‌ దర్శించుకోనున్నారు. అనంతరం ఎస్వీబీసీ కన్నడ,హిందీ ఛానళ్లను సీఎం ప్రారంభించనున్నారు. కొత్త బూందీపోటు భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అన్నమయ్య, భవన్‌లో టీటీడీ, ఏపీ రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ, టీటీడీ కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించనున్నారు.
చదవండి:
చరిత్ర ఎరుగని 'ఆసరా' ఇది

Advertisement
 
Advertisement
Advertisement