రేపు వైఎస్సార్‌ జిల్లాలో సీఎం పర్యటన  | CM YS Jagan Mohan Reddy visit to YSR district On march 11 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌ జిల్లాలో సీఎం పర్యటన 

Mar 10 2024 5:39 AM | Updated on Mar 10 2024 3:14 PM

CM YS Jagan Mohan Reddy visit to YSR district On march 11 - Sakshi

పులివెందులలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.

అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌–1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement