హజ్‌యాత్రికుల బృందాన్ని కలిసిన సీఎం జగన్‌

CM YS Jagan Meets Haj Yatra Pilgrims At Namburu - Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హజ్‌ యాత్రికుల బృందాన్ని కలిశారు. గుంటూరు జిల్లా  పెదకాకాని మండలం నంబూరులో ఏ­ర్పా­టు చేసిన హజ్‌ క్యాంప్‌ నుంచి  హజ్‌యాత్ర బృందం బయల్దేరనుంది.

దీనిలో భాగంగా నంబూరుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌.. యాత్రికులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలిసారిగా నంబూరు హజ్‌ క్యాంప్‌ నుంచి హజ్‌ యాత్రికలు బృందం బయల్దేరనున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం తరఫున హజ్‌ యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్‌. రాష్ట్రం గురించి ప్రార్ధన చేయమని కోరుతున్నానని, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాని సీఎం జగన్‌ తెలిపారు. హజ్‌ యాత్రలో మీకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. హజ్‌ యాత్రలో ఇబ్బంది తలెత్తకుండా కమిటీని పంపిస్తున్నామని,  హజ్‌ యాత్రికులకు ఏ సమస్య వచ్చినా అంజద్‌ బాషా చూసుకుంటారన్నారు సీఎం జగన్‌. ఎమ్మెల్యే అంజద్‌ బాషాతో పాటు ఇతర అధికారులు మీకు అందుబాటులో ఉంటారని హజ్‌ యాత్రికులకు సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

మైనార్టీలకు సీఎం జగన్‌ అండగా నిలిచారు
మైనార్టీల తరఫున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే అంజద్‌ బాషా.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు సీఎం జగన్‌ సంక్షేమ ఫథకాలు అందిచారన్నారు. మైనార్టీలకు సీఎం జగన్‌ ఎప్పుడూ అండగా నిలిచారన్నారు. ఆనాడు వైఎస్సార్‌, ఇప్పుడు సీఎం జగన్‌ మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు. గతంలో పోలిస్తే మైనార్టీలకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ అందాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top