వైఎస్‌ జగన్‌: వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో సీఎం మీటింగ్‌ | YS Jagan Meeting with YSRCP MP's Over Parliamentary Sessions - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో సీఎం జగన్‌ మీటింగ్‌

Sep 14 2020 9:47 AM | Updated on Sep 14 2020 10:31 AM

CM YS Jagan Meeting With YSRCP MPs Over Parliament Session - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 12.30 గంటలకి వారితో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించనున్నారు. ( ‘ఆరోగ్య’ భరోసా )

అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా నేటి సమావేశం జరగనుంది. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా  నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైఎస్సార్‌ సీపీ లోక్‌ సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను  కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement