CM YS Jagan Birthday Special: Sajjala Ramakrishna Reddy Launches Special Website - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday Special: ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించిన సజ్జల

Dec 15 2022 3:19 PM | Updated on Dec 15 2022 5:38 PM

CM YS Jagan Birhtday Special: Sajjala Ramakrishna Reddy Launches Special Website - Sakshi

తాడేపల్లి:  ముఖమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా(డిసెంబర్‌ 21) ప్రత్యేక వెబ్‌సైట్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..  సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో కోట్లాది మంది అభిమానులు పాల్గొంటారని, సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన వారంతా పాల్గొంటారన్నారు.

గతంలో పార్టీ కార్యకర్తలు 38వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైఎ‍స్సార్‌సీపీ బ్లడ్‌ డొనేషన్‌. కామ్‌ పేరిట వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లడ్‌ డొనేషన్‌కు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉందన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని, 20న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు సజ్జల తెలిపారు. 21వ తేదీన పేదలకు అన్నదానం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement