ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం | The CM spoke to the family members of MPDO | Sakshi
Sakshi News home page

ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం

Jul 19 2024 5:15 AM | Updated on Jul 19 2024 5:15 AM

The CM spoke to the family members of MPDO

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ

సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్‌లో మాట్లా­డా­రు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూ­రు­లోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమ­గోదావరి జల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి      చేరు­­కు­న్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యు­లతో కలెక్టర్‌ నాగరాణి మాట్లాడారు. 

ఆ తరు­వాత సునీతతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు.  అనంతరం కలెక్టర్‌ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్‌ నోట్‌లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ  సమా­చారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురా­వా­లని కోరారు. 

ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయ­కుడు దేవినేని ఉమామ­హేశ్వ­రరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునా­యుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు.  శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement