పోలీస్ అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్‌ ట్వీట్‌ | Cm Jagan Tweet On Occasion Of Police Commemoration Day | Sakshi
Sakshi News home page

పోలీస్ అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్‌ ట్వీట్‌

Oct 21 2023 3:52 PM | Updated on Oct 21 2023 3:54 PM

Cm Jagan Tweet On Occasion Of Police Commemoration Day - Sakshi

సాక్షి, తాడేపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నేడు మన ప్రభుత్వం తరపున నిర్వహించాం. ఈ ఏడాది మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సోదరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను’’ అంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

‘‘సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది. నేర నిరోధం, నేర దర్యాప్తులో మన రాష్ట్ర పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. ఈ విభాగంలో నియమించిన 130 మంది సాంకేతిక పోలీసింగ్ నిపుణుల పనితీరు మన ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది’’ అని సీఎం జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చదవండి: ఇస్రో బృందానికి సీఎం జగన్‌ అభినందనలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement