‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇలా | CM Jagan Memantha Siddham BusYatra 19th Day Schedule | Sakshi
Sakshi News home page

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇలా

Apr 19 2024 7:32 PM | Updated on Apr 19 2024 9:03 PM

CM Jagan Memantha Siddham BusYatra 18th Day Schedule - Sakshi

సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్‌ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్‌ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు.

మేమంతా సిద్ధం 19వ రోజు (ఏప్రిల్ 20) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి  బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం నరసింగపల్లి మీదుగా  సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement