తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!

Cheetahs: Fencing In Tirumala Pedestrian Pathway - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుక కంచె ఏర్పాటు అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇనుపకంచె ఏర్పాటుకు కేంద్రం అనుమతులను టీటీడీ కోరింది.

ఈ నెల 12 ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. నడకమార్గంలో పర్యటించి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నాయి. నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. స్పెషల్‌ టైప్‌ క్వార్టర్స్‌, శ్రీవారి మెట్టు నడకదారి, నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే.

తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్‌ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది.
చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top