ఆ నాకొ.. రిటైర్డ్‌ జడ్జి.. | Chandragiri TDP MLA Pulivarthi Nani comments Chevireddy Mohith Reddy | Sakshi
Sakshi News home page

ఆ నాకొ.. రిటైర్డ్‌ జడ్జి..

Jul 1 2026 6:00 AM | Updated on Jul 1 2026 10:59 AM

Chandragiri TDP MLA Pulivarthi Nani comments Chevireddy Mohith Reddy

వాడి సంగతి చూస్తా.. 

బండ బూతులతో విరుచుకుపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని

రూ.100 కోట్ల భూమి కబ్జా వ్యవహారం బయటకు రావడంతో అక్కసు

చంద్రగిరి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి లోకేష్‌రెడ్డితో ఫోన్‌ సంభాషణ 

బాధితులకు అండగా నిలిచిన రిటైర్డ్‌ జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే కుటుంబంపైనా బూతులు  

మీడియా ఎదుట బట్టబయలు చేసిన చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : వాడెవడో రిటైర్డ్‌ జడ్జి అంట.. వానెమ్మను.. ఆ లం.. కొడుకు నాపైన కేసు పెట్టిస్తున్నాడు.. వాడి సంగతి.. చెవిరెడ్డికి ఇంకా నరకం చూపిస్తాను.. దీని వెనుక ఉన్న వారందరికీ నరకం చూపిస్తా చూడు.. నా.. కొడుకు, వాడు లం..కొడుకు.. ఇంకా బాధలు పడి అనుభవించేలా చేస్తా చూడు.. వదిలేది లేదు.. దొంగ ఓట్లు కేసు ఓపెన్‌ చేయిస్తా నా..కొడుక్కి. పై మాటలు చూస్తే మీకేమనిపిస్తోంది.. ఎవడో తాగుబోతు మాట్లాడినట్లుందనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చిన మాటలివి. న్యాయమూర్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా.. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నోటి నుంచి వెలువడిన మాటలివి.

 శ్రీవారి పాదాల చెంత.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినిపించిన దుర్భాష ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నోటి నుంచి వెలువడిన ఈ భాషను సభ్య సమాజం ఈసడించుకుంటోంది. భూ కబ్జాను అడ్డుకున్న రిటైర్డ్‌ జడ్జిని, బాధితులకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబాన్ని పత్రికల్లో రాయలేనంత ఘోర పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఐరాల లోకేష్‌రెడ్డి మధ్య జరిగిన ఆ ఫోన్‌ సంభాషణ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 

ఈ ఆడియోను చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి మంగళవారం తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలో మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. ఆ సంభాషణలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉపయోగించిన పదజాలంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. 

తిరుపతి రూరల్‌ మండలం అవిలాల సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని 2002లో రిటైర్డ్‌ ఆర్టీఓ ద్వారకానాథరెడ్డి రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో తన భార్య వనజాక్షి పేరుతో 24 ఏళ్ల క్రితం 3.17 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుంది. ఈ భూమిని ఎమ్మెల్యే పులివర్తి నాని కబ్బా చేసి ఏకంగా ప్రహరీ కట్టేశారు. వృద్ధ దంపతులు తమ స్థలం దుస్థితిపై అధికారులతోపాటు రాజకీయ పార్టీలు, మీడియా దృష్టికి తెచ్చారు. వారికి మద్దతుగా కేసు వాదించడానికి ఒక రిటైర్డ్‌ జడ్జి, సీనియర్‌ న్యాయవాది ముందుకొచ్చారు.  

భూమి దక్కదని బరితెగింపు..
బాధితులకు నేతలు, ప్రజా మద్దతు లభించడంతో తను ఆక్రమించుకున్న భూమి తనకు దక్కదేమోనన్న ఆక్రోశంతో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని.. ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి లోకేష్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆ వృద్ధ దంపతులను, వారి తరఫున కేసు వాదించడానికి వచ్చిన రిటైర్డ్‌ జడ్జిని, చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఇష్టానుసారం అసభ్య పదజా­లంతో దూషించారు. 

‘వాడెవ్వడో రిటైర్డ్‌ జడ్జి అంట.. ఊల్లోళ్లకు పుట్టిన లం.. కొ.. నాపైన కేసు పెట్టిస్తున్నాడు.. వానెమ్మను.. ఆ.. లం.. కొ.. నాపైన కేసు పెట్టిస్తాడా.. వాడికి ..పని లేక ఇలాంటి పనులు చేస్తున్నాడు.. చెవిరెడ్డికి ఇంకా నరకం చూపిస్తాను.. దీని వెనుక ఉన్న వారందరికీ నరకం చూపిస్తా చూడు.. నా.. కొ.. వాడు లం..కొడుకు.. ఇంకా బాధలు పడి అనుభవించేలా చేస్తా చూడు.. వదిలేది లేదు.. దొంగ ఓట్లు కేసు ఓపెన్‌ చేయిస్తా నా..కొ..’ అంటూ నీచంగా మాట్లాడారు. 

‘ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు మీ సహకారం మరువ­లేనిది.. అందుకే నీకు ఫోన్‌ చేస్తున్నా.. మని­ద్దరిదీ బ్రదర్‌ రిలేషన్స్‌.. మన రెండు పార్టీలు ఒక్కటే..’ అని కాంగ్రెస్‌ నేత లోకేశ్‌తో ఎమ్మెల్యే అన్నారు. కాగా, ఈ సంభాషణపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆడియోపై చంద్రబాబు, మంత్రి లోకేశ్, పవన్‌ కళ్యాణ్, పచ్చ పత్రికలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఒక రిటైర్డ్‌ జడ్జిని తిట్టడంపై న్యాయవాదులు, న్యాయమూ­ర్తులు స్పందించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement