విజనరీ కాదు.. విధ్వంసకారి | Chandrababu Naidu misusing power in local body elections | Sakshi
Sakshi News home page

విజనరీ కాదు.. విధ్వంసకారి

Nov 1 2026 5:10 AM | Updated on Nov 1 2026 5:10 AM

Chandrababu Naidu misusing power in local body elections

స్థానిక ఎన్నికలను రక్తసిక్తం చేసిన చంద్రబాబు

నామినేషన్ల దశ నుంచే కిడ్నాప్‌లు..హైజాక్‌

ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు..నామినేషన్‌ పత్రాల చించివేత

వైఎస్సార్‌సీపీ పేరుతో టీడీపీ అభ్యర్థుల నకిలీ నామినేషన్లు

ఆపై ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు

నేడు ఓట్ల రిగ్గింగ్‌కు ప్రణాళిక.. రంగంలోకి రౌడీలు

సాక్షి, అమరావతి: తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు ఓటు వేయకముందే ఎన్నికలను ఎలా ఖూనీ చేయొచ్చో రాష్ట్రానికి చూపించారు. రక్తపాతం, రౌడీయిజం, అధికార దుర్వినియోగంతో ప్రతిపక్ష అభ్యర్థులను బరిలోకి రానివ్వకుండా అడ్డుకుని, ఇప్పుడు పోలింగ్‌ బూత్‌లపై కన్నేశారు. తాను ప్రజాస్వామ్య రక్షకుడినని కలరింగ్‌ ఇచ్చుకుంటూనే ప్రజాస్వామ్య భక్షకుడిగా మారారు.

నామినేషన్‌ కేంద్రాలే రణరంగాలు
నామినేషన్ల పర్వంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను ముందుగానే గృహ నిర్బంధం చేశారు. బైండోవర్‌ కేసులు పెట్టారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు గుంపులుగా తిరిగేందుకు అనుమతిచ్చి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంట ఇద్దరు ముగ్గురినే పంపారు. ఆ అదనుతో టీడీపీ మూకలు దాడులు చేశా­యి. నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేశాయి. మహిళా అభ్యర్థులనూ వదల్లేదు. పోలీసులు, ఆర్వో­ల కళ్లెదుటే ఎంపీలు, మాజీ మంత్రులపైనా దాడులు జరిగినా అధికారులు చూస్తూ ఉండిపోయారు.

ప్రతిపక్షం పేరుతో నకిలీలు
టీడీపీ సానుభూతిపరులే తాము వైఎస్సార్‌సీపీ అభ్యర్థులమంటూ నామినేషన్లు వేశారు. అసలు అభ్యర్థులను అడ్డుకుని, నకిలీలను నిలబెట్టి.. అందరికీ పోటీ అవకాశం దక్కిందన్న భ్రమ కల్పించారు. అధికారిక అభ్యర్థిని తేల్చే ఫారం–ఏ, బీలనూ అధికారులు పట్టించుకోలేదు.

స్క్రూటినీలో కుట్ర.. ఫోర్జరీతో ఉపసంహరణ
బెదిరింపులకు లొంగని వారి నామినేషన్లను చిన్నచిన్న సాకులతో తిరస్కరించారు. సమర్పించిన ధ్రువపత్రాలు మాయం చేసి పత్రాలు లేవనే సాకుతో వేటు వేశారు. మరికొన్నిచోట్ల అభ్యర్థులకు తెలియకుండానే సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రాలు ఇచ్చారు. వాటిని అధికారులు గుడ్డిగా ఆమోదించారు.

ఇప్పుడు బూత్‌ల ఆక్రమణకు స్కెచ్‌...
నామినేషన్ల సమయంలో ఇన్ని అరాచకాలు చేసి ఆదివారం పోలింగ్‌ రోజు మరింత రాక్షసకాండకు స్కెచ్‌ వేశారు. బూత్‌ క్యాప్చరింగ్‌కు పక్కా ప్రణాళిక సిద్ధమైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, బూత్‌లను గూండాల చేతుల్లో పెట్టేందుకు ఏజెంట్ల నియామక నిబంధనలనే మార్చేశారు. 

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియోజకవర్గంలోని పులివెందులకు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే రౌడీమూకలను, కిరాయి గూండాలను తరలించారు. పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫారాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి బూత్‌లో సీసీ ఫుటేజీ రికార్డు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సమయం లేదని చేతులెత్తేయడం చంద్రబాబు అక్రమాలకు గేట్లు బార్లా తెరిచినట్టయింది.

గెలుపుపై నమ్మకం ఉంటే భయమెందుకు?
ప్రజల మద్దతు తమకే ఉందని చంద్రబాబుకు నమ్మకం ఉంటే..ప్రతిపక్ష అభ్యర్థులను ఎందుకు అడ్డుకుంటున్నారనే దానికి నేటికీ సమాధానం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement