ఎంటీఎస్‌ ఉపాధ్యాయులపై సర్కారు కక్ష సాధింపు | Chandrababu Govt Harassing MTS teachers | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ ఉపాధ్యాయులపై సర్కారు కక్ష సాధింపు

Jun 23 2026 5:06 AM | Updated on Jun 23 2026 5:06 AM

Chandrababu Govt Harassing MTS teachers

ఎంటీఎస్‌ టీచర్లను జీవోలకు విరుద్ధంగా బదిలీల పేరుతో సుదూర, కొండ ప్రాంతాలకు విసిరేస్తున్న ప్రభుత్వం 

1998 తర్వాత రెండుసార్లు సీఎంగా పని చేసినా అభ్యర్థులకు న్యాయం చేయని చంద్రబాబు 

2023లో సీఎంగా వైఎస్‌ జగన్‌ ­­­­­చరిత్రాత్మక నిర్ణయం 

1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు 

దశాబ్దాల నిరీక్షణ తర్వాత 4,900 మందికి ఉపాధ్యాయ కొలువులు 

ఎంటీఎస్‌ కింద సొంత మండలాలకు, సమీప ప్రాంతాల్లోనే పోస్టింగులు 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు నరకం 

ఉద్యోగ వయో పరిమితి 62 ఏళ్లకు పెంపుపై అస్పష్టత

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్‌ డీఎస్సీ 1998, 2008 కింద మినిమం టైమ్‌ స్కేల్‌పై (ఎంటీఎస్‌) పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఉద్యోగాలకు అర్హులై, దశాబ్దాల సుదీ­ర్ఘ నిరీక్షణ తర్వాత ఉపాధ్యాయ కొలువులోకి అడుగు­పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడు­తోంది. జీవోలకు విరుద్ధంగా బదిలీల పేరుతో కౌన్సెలింగ్‌ చేపట్టి ఇష్టారీతిన తలోదిక్కుకు విసిరేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. వాస్తవానికి 1998, 2008 డీఎస్సీకి చెందిన దాదాపు 4,900 మందికిపైగా అర్హులకు దశాబ్దాల తర్వాత  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగింది.

వీరిని మినిమం టైమ్‌ స్కేల్‌ కింద పరిగణిస్తూ ఉపాధ్యాయులుగా నియమించింది.వారికి సొంత మండలాలు, సమీప ప్రాంతా­ల్లోనే పోస్టింగులు ఇచ్చింది. వారి జీవన ప్రమాణాలను, కుటుంబం, వయసు, ఆరోగ్య కారణాలరీత్యా మానవతా దృక్పథంతో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో మినిమం టైమ్‌ స్కేల్‌తో రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో పాటు పనిచేస్తున్న వారిని బదిలీల పేరుతో వందల కిలోమీటర్ల దూరానికి, కొండలు, అటవీ ప్రాంతాల్లోకి విసిరేసింది. కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాలు కల్పించారనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని పాశవిక చర్యలకు పాల్పడుతోంది. 

కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా 
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి, ధర్నాలకు దిగడంతో చాలాచోట్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభు­త్వం 4,900 మంది టీచర్లకు సమీప ప్రాంతాల్లోని ఖాళీ­లను బ్లాక్‌ చేసి సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రదే­శాలు, కొండలు, అటవీ కేంద్రాల్లో మాత్రమే పోస్టులను చూపించి బలవంతంగా నెట్టేందుకు కుయుక్తులు పన్ను­తోంది. దీనికి ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు టీడీపీ అనుకూల వ్యక్తులు సైతం వంతపాడుతూ పోస్టు­లను బ్లాక్‌ చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది.

గత ప్ర­భుత్వంలో జారీ చేసిన జీవో–27ను తుంగలో తొక్కడం గమనార్హం. రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా ఏకోపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్య­తలు నిర్వహిస్తున్న వారికి రాజకీయ కోణంలో చూస్తుండటం ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతోంది. దీనిపై 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు రెండేళ్లుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కనికరం చూపించడంలేదు. పైగా సదరు ఉపాధ్యాయుల సర్వీసును 62 ఏళ్లకు పెంపుపైనా నోరు మెదపడంలేదు. హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఇతర ఆర్థిక లబ్ధికి దూరంగా 11 నెలలు మాత్రమే జీతం తీసుకుంటూ పనిచేస్తున్న వారిపై కనికరాన్ని ప్రదర్శించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement