మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం | Chandrababu Government Decides To Increase Liquor Sales | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం

Jun 27 2026 6:23 PM | Updated on Jun 27 2026 6:52 PM

Chandrababu Government Decides To Increase Liquor Sales

సాక్షి, విజయవాడ: మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎయిర్‌పోర్టుల్లో వైన్‌ షాపులు, బార్లకు అనుమతి ఇవ్వనుంది. తిరుపతి మినహా అన్ని ఎయిర్‌పోర్టుల్లో మద్యం విక్రయాలు జరపనున్నారు. ఎయిర్‌పోర్టుల్లో వైన్స్, బార్లకు 24 గంటలూ అనుమతి ఇవ్వడానికి నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులు, పన్నులపై కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది.

బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు. మద్యం షాపుల దరఖాస్తు రుసుము రూ.2లక్షలు. ఎయిర్‌పోర్టు వైన్‌ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.కోటిగా చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన ఎయిర్‌పోర్టుల్లో బార్లకు ఎక్సైజ్ ట్యాక్స్ రూ.25లక్షలు. 20 లక్షలలోపు సర్క్యులేషన్ ఉంటే రూ.15లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రైవేట్‌ వైన్ షాపులు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవలే బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎయిర్ పోర్టులలో వైన్ షాప్, బార్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement