
సాక్షి,విజయవాడ: కాపు ఉద్యమ కారులపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ కేసులు మళ్ళీ తిరగదోలాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కాపు ఉద్యమ కారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చెయ్యాలని పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వుల ద్వారా సమాచారం అందించింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ రైల్వే కోర్టు తీర్పును వెలువరించింది. తాజాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం మళ్ళీ తుని ఘటనలో కాపు ఉద్యమ కారుల కేసులు విచారించేందుకు సిద్ధమైంది. కాగా, ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళీ అప్పీల్‌కు వెళ్లాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఉద్యమకారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.