కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం | Bribe Collect Konaseema District Dmho Office | Sakshi
Sakshi News home page

కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం

Nov 30 2024 7:14 PM | Updated on Nov 30 2024 7:17 PM

Bribe Collect Konaseema District Dmho Office

జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్‌ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు.

సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్‌ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్‌వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

మెడికల్ ఆఫీసర్లను  డీఎంహెచ్‌వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.

కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో  అనధికార డిప్యుటేషన్‌ల్లోనూ డీఎంహెచ్‌వో­లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా­యి.

అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగు­లు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యు­టేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యా­దులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జి­ల్లా కేంద్రంలో కొనసాగడానికి వీ­రు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

గుంటూరు డీ­ఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారు­ల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉ­ద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నా­రు. అర్బ­న్‌ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులు­గా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement