‘తెగువకు తెగువకు రణరణ సమరం’.. ఆలపించిన ఎమ్మెల్యే భూమన

Bhumana Karunakar Reddy Sung Song Of Kabaddi Tourney Promotion - Sakshi

జాతీయ కబడ్డీ పోటీల ప్రాముఖ్యతను చాటేందుకు బృందగానం 

ఆలపించిన ఎమ్మెల్యే భూమన, తిరుపతి మేయర్‌ శిరీష, కమిషనర్‌ గిరీషలు

కబడ్డీ పాటను బృందగానం ద్వారా రికార్డు చేస్తున్న దృశ్యం

తిరుపతి తుడా: లే..పంగా..లే..పంగా అంటూ కబడ్డీ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రో కబడ్డీని ఉన్నత స్థానానికి చేర్చిన బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ గానం అప్పట్లో ఓ మైలురాయిగా నిలిచింది. తిరుపతి వేదికగా నిర్వహిస్తోన్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ‘తెగువకు తెగువకు రణరణ సమరం..లే..పంగా కబడ్డీ కబడ్డీ ఖే లో కబడ్డీ’ అంటూ నూతనంగా రచించిన ఈ గీతాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆలపించగా తిరుపతి మేయర్‌ శిరీష, కమిషనర్‌ గిరీష, కార్పొరేటర్‌ రామస్వామి వెంకటేశ్వర్లు గొంతు కలిపారు.

చదవండి: శభాష్‌ విజయ్‌.. యోగాలో గిన్నిస్‌ రికార్డ్‌

తిరుపతిలోని ఓ రికార్డింగ్‌ స్టూడియోలో ఈ పాటను ఆదివారం రికార్డు చేశారు. తిరుపతిలో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కబడ్డీ క్రీడ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెడ్‌లైట్‌ల వెలుగులో జరిగే  ఈ మ్యాచ్‌లు నగర వాసులకు కొత్తదనాన్ని అందించనున్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top