మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని | Balineni Srinivasa Reddy Serious Comments On TDP | Sakshi
Sakshi News home page

మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని

Apr 2 2023 1:44 PM | Updated on Apr 2 2023 1:46 PM

Balineni Srinivasa Reddy Serious Comments On TDP - Sakshi

సాక్షి, ప్రకాశం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. 

కాగా, బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. మేము తలుపులు తెరిస్తే టీడీపీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరు. 40 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్‌లో ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుకున్నారు?. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకంది టీడీపీనే. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను. కోర్టుకు వెళ్లలేదని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement