చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.. | Avanthi Srinivasa Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు: మంత్రి అవంతి

Sep 26 2020 1:09 PM | Updated on Sep 26 2020 2:33 PM

Avanthi Srinivasa Rao Fires On Chandrababu Naidu - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, విశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం రోజున సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు తన రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆయన కుల రాజకీయాలను ప్రజలు నమ్మలేదు. దీంతో చంద్రబాబుకు వేరే దారిలేక ఇప్పుడు మతంతో రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డిక్లరేషన్‌ను వివాదం చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు మతమార్పిడి కోసమని చంద్రబాబు అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. దేవాలయాలపై దాడులు చేసి వారిని వదిలి పెట్టేది లేదు' అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement