
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ...ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గురించి వివరించినట్లు తెలిపారు.
అలాగే ఏపీ పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర మంత్రులను ఆస్ట్రేలియాకు రప్పించి, అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్న విషయం కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ద్వారా కరోనా సమయంలో ఎంతోమంది ఆదుకొన్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతిఏటా వైఎస్సార్ జయంతి, కార్యక్రమాలు, సీఎం జగన్ పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించి పేదలకు చేయూత నిస్తున్నామని చెప్పారు.
చదవండి: అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో..