APPSC Group 2 Prelims Result: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల | APPSC Group 2 Prelims Result 2024 Released - Sakshi
Sakshi News home page

APPSC Group 2 Prelims Result: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల.. జులై 28న మెయిన్స్‌

Published Wed, Apr 10 2024 7:16 PM

Appsc Released Group 2 Prelims Results - Sakshi

సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్‌10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 

1:100 నిష్పత్తిలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 

రాష్డ్ర వ్యాప్తంగా 899  పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. 

ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు 

Advertisement
 
Advertisement