నాడు 243.. నేడు 29 పోస్టులే | Massive job cuts in the Women and Child Welfare Department | Sakshi
Sakshi News home page

నాడు 243.. నేడు 29 పోస్టులే

Oct 9 2026 5:05 AM | Updated on Oct 9 2026 5:05 AM

Massive job cuts in the Women and Child Welfare Department

మహిళా, శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాల కోత 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 243 పోస్టులకు నోటిఫికేషన్‌ 

తాజాగా 29 పోస్టుల భర్తీకి మాత్రమే ఏపీపీఎస్సీకి అనుమతి 

అభ్యర్థుల ఎదురుచూపులపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ, మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 243 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ జీవో జారీ చేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకంగా 214 పోస్టులను గాల్లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. 

క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీల పర్యవేక్షణ, బాలింతలు, గర్భిణులకు పోషకాహార పంపిణీ బాధ్యతలను చూసే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 243 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో 61 సీడీపీవో/ఏసీడీపీవో, 161 గ్రేడ్‌–1 సూపర్‌వైజర్, 21 చి్రల్డన్స్‌ హోమ్స్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఉన్నాయి. 2023లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీఎస్‌) సాధనకు 243 పోస్టులు అవసరమైతే, 2026 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 450కిపైగా ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు పోస్టులు పెంచాల్సింది పోయి ఉన్నవాటిని కుదించడమేంటని అభ్యర్థులు బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులు 
హోంసైన్స్, సోషల్‌ వర్క్, న్యూట్రిషన్‌ వంటి ప్రత్యేక కోర్సులు పూర్తిచేసి, నోటిఫికేషన్‌ వస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉద్యోగాల కల్పనపై పెద్దఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ఉన్న పోస్టులకే కోత పెట్టడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆమోదం పొందిన మొత్తం 243 పోస్టులతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఖాళీల భర్తీకి తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జారీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement