సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరిధిలోని ఎనిమిది రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఖాళీల వివరాలు, వేతన శ్రేణి, వయోపరిమితి, సామాజిక వర్గాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, పోస్టుల వారీగా నిబంధనలను అధికారిక వెబ్సైట్లోని సంబంధిత సమగ్ర నోటిఫికేషన్లలో పరిశీలించవచ్చు. పూర్తి వివరాలను కమిషన్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 16న ప్రారంభమై నవంబర్ 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు కొనసాగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సమగ్ర నోటిఫికేషన్లను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
» దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (నోటిఫికేషన్ నం.23/2026).
» జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసులో జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్–2/ఇన్టేక్ ప్రొబేషన్ ఆఫీసర్ (నోటిఫికేషన్ నం.12/2026).
» పరిశ్రమల శాఖలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు (నోటిఫికేషన్ నం.24/2026).
» మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్లు గ్రేడ్–1 (నోటిఫికేషన్ నం.13/2026).
» అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు (నోటిఫికేషన్ నం.17/2026), డ్రాఫ్టŠస్మన్ గ్రేడ్–2 (టెక్నికల్ అసిస్టెంట్) (నోటిఫికేషన్ నం.15/2026), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (నోటిఫికేషన్ నం.18/2026), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (నోటిఫికేషన్ నం.16/2026).


